కోరుట్ల, ముద్ర
కథలాపూర్ మండల కేంద్రంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు హెవీ వాహనాలు, ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో ఎస్సై రవి కిరణ్ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డా. సింధు, డా. మైస శ్రీధర్ డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు కంటి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. శిబిరానికి డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.