Take a fresh look at your lifestyle.

రాజీలేని పోరాటం చేసిన యోధుడు కామ్రేడ్ కిరణ్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(UEEU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాజులేని పోరాటం చేసే ఉద్యోగ కార్మిక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు కామ్రేడ్ కిరణ్ అని ఆయన ఆశయ సాధన కోసం విద్యుత్ కార్మికుల ఐక్యతతో ముందుకు సాగాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (UEEU) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి అన్నారు. గురువారం రోజున స్థానిక కార్మిక కర్షక భవనంలో మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కిరణ్ ఏడవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలవాల స్వామి మాట్లాడుతూ ఆనాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో యూనియన్ ఏర్పాటు చేయడానికి కిరణన్న మొట్టమొదటిగా ప్రయత్నం చేసి యూనియన్ స్థాపించడానికి ఉద్యమాన్ని నిర్మించారన్నారు. ఆయన ప్రాణాల పోయే చివరి వరకు కూడా విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి స్ఫూర్తి ప్రదాత కామ్రేడ్ కిరణ్ అన్నారు. అయన లేకపోయినా ఆయన కలలు కన్నా ఆర్టిజన్ కన్వెన్షన్ తదితర అంశాలు పరిష్కారం కోసం ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు నిర్మించి విద్యుత్ కార్మికుల యొక్క హక్కులను కాపాడుకునే కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు.అప్పుడే ఆయనకు మనం అందించే నిజమైన నివాళులు ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట మధు సిఐటియు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, ఇప్పకాయల శోభ ఐద్వార్ జిల్లా సహాయ కార్యదర్శి జాలిగాపు శిరీష యూనియన్ జిల్లా అధ్యక్షులు అశోక్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు కర్ణాకర్, నాయకులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.