Take a fresh look at your lifestyle.

నిబంధనలను పట్టించుకోని ప్రైవేట్ పాఠశాలలు

  • జిల్లా విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

గొల్లపల్లి, ముద్ర: విచ్చలవిడిగా అధిక ఫీజులను వసూలు చేస్తూ నియమనిబంధనలు గాలికి వదిలేస్తున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యం. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో అధికారుల పర్యవేక్షణ కరువు. పాఠశాల యాజమాన్యం అధిక ఫిజులు వసూలు చేస్తూ పిల్లలను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పట్టించుకోకుండా,జిల్లా,మండల విద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,పలురు పేర్కొన్నారు.విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలలో 25% ఏసీ ఎస్టీ పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలి.కానీ జిల్లా,మండల వైద్యాధికారుల నిర్లక్ష్యం వలన ఎక్కడ జరగడం లేదని పిల్లలు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో ప్రైవేట్ రంగంలో విద్యా సంస్థలు నడిచేవి వాటి సేవను గుర్తించిన ప్రభుత్వాలు గ్రాడ్ ఇన్ ఎయిడ్ ను ఇచ్చేవి లాభపెక్ష లేని విధానమైంది. కాలం మారింది విధానాలు మారాయి విద్య అంగడి వస్తువుగా మారింది.పిల్లలు రేపటి పెట్టుబడి సరుకుల్లా భావించబడుతున్నారు. ఇదో అనారోగ్యకరమైన వాతావరణం.దీని పై ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాల వెంటనే రద్దు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.