Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మంచి నీటి కష్టాలు

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

మహేశ్వరం, ముద్ర ప్రతినిధి:  కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే ప్రజలు మంచి నీటి కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి కోసం ప్రజలు అల్లాడుతున్న  ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటని  సబిత మండిపడ్డారు. బుధవారం మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్, ఎన్ టి ఆర్ లో సబితా ఇంద్రారెడ్డి స్థానిక నాయకులతో కలిసి పర్యటించి, స్థానికంగా ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బస్తీలో నెలకొన్న మంచి నీటి సమస్యను సబితా ఇంద్రారెడ్డి దృష్టికి మహిళలు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా పది ఏళ్ళు మిషన్ భగీరథ ద్వారా నిరంతరాయంగా ఇంటింటికి మంచి నీరు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు తీవ్ర మంచి నీటి ఎద్దడికి గురౌవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే మంచి నీటి సమస్య ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తీసుకువస్తానన్నా మార్పు అంటే ఇదేనా అని హెద్దేవ చేశారు. కనీస  మౌలిక సదుపాయాలను కూడా తీర్చలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.  వేసవిని దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడం దారుణమని మండిపడ్డారు.ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మంచి నీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, ఆర్కే పురం డివిజన్ ప్రెసిడెంట్  నాగేష్, షాజీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.