ముద్ర, తాండూర్ ప్రతినిధి :
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని విలేమున్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి చందు మహారాజ్ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇట్టి వర్ధంతి వేడుకల్లో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, చందు మహారాజ్ కుమారుడు నరేష్ మహారాజ్ పార్టీ సీనియర్ నాయకులు సంపత్ కుమార్, లక్ష్మారెడ్డి తదితరులు చందు మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాండూర్ ప్రాంత అభివృద్ధి కోసం చందు మహారాజ్ అహర్నిశలు కృషి చేశాడని అందువల్లే తాండూర్ ప్రాంత ప్రజల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందని, ప్రతి ఒక్కరూ చందు మహారాజ్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, పి బసవరాజ్, బాతుల వెంకటయ్య, ఎంఏ అలీమ్, లింగదాల రవికుమార్, హబీబ్ లాల, న్యాయవాది జిలాని, సత్యమూర్తి, భీమ్ శంకర్, సుదర్శన్ గౌడ్, భగవాన్ శివ కుమార్, పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.