ముద్ర, తాండూర్ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన బాతుల నాగరాజ్ గారిని ఐ ఎన్ టి యు సి తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు న్యాయవాది జిలాని, పట్టణ మాజీ అధ్యక్షులు సయ్యద్ హబీబ్ లా ల ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి పట్టణ అధ్యక్షులుగా నియామకం అయినందుకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించడం జరిగింది. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లను కార్యకర్తలను అందరిని కలుపుకొని పోయి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేదలకు అందే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. మేమంతా మీ వెంట కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని వారు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో మైనార్టీ చైర్మన్ అబ్దుల్ మతిన్,మోయిస్ బేగ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అక్బర్ అడ్వకేట్ కాలిక్ అలీ, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఖాజా, రియాజుద్దీన్, సయ్యద్ గౌస్ లాలా, సమీర్ తదితరులు పాల్గొన్నారు.