Take a fresh look at your lifestyle.

ఆశ వర్కర్లతో పెట్టుకుంటే శంకరగిరి మాన్యలే – బి ఆర్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

ఆశా వర్కర్లతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలేనని బిఆర్ టి యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు టైగర్ కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆశా వర్కర్లకి 18 వేల రూపాయలు నెలకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేరని కృష్ణయ్య ప్రశ్నించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పెంచిన జీతాలు ఇవ్వడానికే, మూడు, మూడు, నెలలు పెండింగ్లో పెడుతున్నారని ఇలా అయితే ఆశా కార్యకర్తలు ఎలా బతుకగలుగుతారని? కృష్ణయ్య ప్రశ్నించారు. 28వ తారీఖున తెలంగాణ గ్రామీణ ఆరోగ్య ఆశా కార్యకర్తల సంఘం అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించిన బి ఆర్ టీ యు నాయకులను, ఆశ నాయకులను, ఆశా కార్యకర్తలను, ఎక్కడికక్కడ, జిల్లాలల్లో, హైదరాబాదులో, అక్రమంగా, దౌర్జన్యంగా, బలవంతంగా, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి, మహిళలని చూడకుండా అనేక పోలీస్ స్టేషన్లో నిర్బంధించి, అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బి ఆర్ టి యు. తెలంగాణ ఆశ యూనియన్ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా బీఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు టైగర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టైగర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను వేధించడమేనా? అని కృష్ణయ్య ప్రశ్నించారు? మార్చి 11వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు సంపూర్ణంగా సమ్మె చేస్తుంటే, పెండింగ్ లో ఉన్న మూడు నెలల జీతాలు ఇవ్వకుండా, అలాగే పెంచుతామన్న 18000/- రూ జీతం పెంచకుండా, ఆశాల సమస్యల పట్ల ఏ మాత్రం పరిష్కార దిశగా చర్యలు తీసుకోకపోగా, కక్ష సాధింపు చర్యలకు దిగడం, పట్ల ఆశా కార్యకర్తలు ఆగ్రహానికి, గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలు చనిపోతే కనీసం వాళ్ళని, వాళ్ళ కుటుంబాలను, ఆదుకోవడానికి 50 లక్షల బీమా, ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు అందరూ పేదవారని, వాళ్ళ జీతాలు అతి తక్కువ అని, వారికి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పకుండా ఇవ్వాలని, డిమాండ్ చేశారు. జిల్లాలోని అనేక పీహెచ్సీలల్లో డాక్టర్లు, నర్సులు, ఆశా కార్యకర్తల పట్ల బెదిరింపులకు పాల్పడుతూ, డ్యూటీలు చేయాలని, ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, తీవ్ర పరిణామాలు, ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా, మనుగడ సాగించలేదని, గుర్తు చేశారు. ఒకవేళ కార్మికుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, ఇంకా అనేక రంగాల ప్రజల సమస్యలు, పరిష్కరించకుంటే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మట్టిలో కలవడం ఖాయమని, హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలకోరు ముఖ్యమంత్రి అని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలు మాట్లాడుతూ కాలం వెళ్ళదీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి కార్మికుల సమస్యలను చూసి పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆశాలకు 18000 ఫిక్స్డ్ వేతనం మూడు నెలల పెండింగ్ వేతనం 50 లక్షల ప్రమాద బీమా గ్రామాల్లో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో అధికారుల రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆశాల ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మంజుల, జిల్లా కార్యదర్శి అనిత, ఇందిరా, శ్యామల, అనురాధ, జ్యోతి నరసమ్మ, జమునా బాయి. విజయలక్ష్మి లావణ్య రాధిక లక్ష్మి అనూష, అనిత మరియు జిల్లాలోని ఆశా కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.