ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలవడం గర్వించదగ్గ విషయమని డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్ అన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ లో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్నను గురువారం శాలువాతో సత్కరించి అభినందించారు. పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు అద్భుతమైన ప్రగతిని కనబరిచారని, అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడి రాష్ట్రంలో టాప్ 3లో నిలవడం హర్షణీయమని అన్నారు. రానున్న రోజుల్లో ఇదే తరహాలో ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ జిశాన్ అలీ పాల్గొన్నారు.