Take a fresh look at your lifestyle.

విద్యాధికారికి సన్మానం

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
మహబూబ్‌నగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సి. రమణి ని జిల్లా ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మంగళవారం సంఘం నాయకులు సన్మానించారు. ఇంటర్ విద్యలో ప్రైవేట్ కాలేజీ ఉత్తమ విద్యని అందిస్తున్నాయని, విద్యార్థులను ఇంటర్ విద్యతో పాటు వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి విజేతలుగా తీర్చిదిద్దుతున్నామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా రమణిమాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రైవేట్ కళాశాల లు కృషి చేయాలని సూచించారు.ప్రవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్ విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ కళాశాలలతో పాటు, ప్రైవేట్ కళాశాలలు ఇంటర్ బోర్డు కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.రమేష్ గౌడ్( జలజం ),రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జహీర్ అక్తర్, వెంకటరెడ్డి, వెంకటయ్య, మధుమోహన్, వెంకట రాములు,వెంకటేశ్వర్ రెడ్డి , రాఘవేందర్, ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.