Take a fresh look at your lifestyle.

ఈనెల 10 నుంచి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు…

ఏర్పాట్లు చేస్తున్న అధికారులు…
ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దు..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 10 నుండి 13 వ తేదీ వరకు మూడు రోజులపాటు పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. దీంతో జయంతి వేడుకలను పురస్కరించుకొని ఎండోమెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంజనేయ స్వామి పెద్ద హనుమాన్ జయంతి ఈ నెల 10 నుండి 12 వ తేదీ వరకు మూడు రోజులపాటు జరగనున్న సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్టు ఆలయ ఈ వో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాల విరమణ, కేశ ఖండనం, ప్రత్యేక దర్శనాలు మాత్రమే కొనసాగుతాయన్నాని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.