Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

  • ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా
  • పోలింగ్ జరుగుతున్న తీరు పరిశీలన

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: శాసనమండలి సభ్యుల ఎన్నిక పోలింగ్ జిల్లాలో సజావుగా జరుగుతుందని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా అన్నారు.గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మహేష్ దత్త్ ఏక్కా, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న పట్టభద్రులు,టీచర్స్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ జిల్లాలోని 50 పోలింగ్ కేంద్రాలలో పట్టభద్రులు,టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నామన్నారు.పోలింగ్ ముగిసిన తర్వాత కరీంనగర్ లో ఉన్న రిసెప్షన్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్స్ లను తరలించడం జరుగుతుందని అన్నారు.ఈ పర్యటనలో తహసిల్దార్ రామచందర్ రావు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.