Take a fresh look at your lifestyle.

విలీన ప్రాంతాల అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు

  • ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.

ముద్ర, జగిత్యాల టౌన్: జగిత్యాల పట్టణంలోని విలీన ప్రాంతాల అభివృద్ధికి రూపాయలు డెబ్బై కోట్ల నిధులు మంజూరైనట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 వంద రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో జగిత్యాల పట్టణంలోని 9 వ వార్డు లింగం చెరువు వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూకపల్లి డబల్ బెడ్ రూమ్ కాలనీని జగిత్యాల పట్టణంలో కలపడం జరిగిందని, జగిత్యాల చుట్టు గ్రామాల పరిసర ప్రాంతాలు కలపడం వల్ల అభివృద్ధి వేగంగా పెరిగిందన్నారు.100 రోజుల ప్రణాళిక తో పట్టణం పారిశుద్ధ్యం పచ్చదనం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో18వేల ఇండ్లకు ఉచిత కరెంట్ ను, 20వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, డబల్ బెడ్ రూం ల కాలనిలో దాదాపు సగం ఇండ్లకు సీసీ రోడ్లు పూర్తి అయ్యాయని, పట్టణంలో 25 కోట్ల తో పనులు జరుగుతున్నాయన్నారు. జగిత్యాల పట్టణం లో తాగు నీటి కోసం 36 కోట్ల తో పనులు జరుగుతున్నాయని, ఎస్ కే ఎన్ ఆర్ కళాశాలలో తాగు నీటి ట్యాంక్ నిర్మాణం తో శంకుల పల్లె, పోచమ్మ వాడ, హనుమాన్ వాడ తదితర ప్రాంతాలకు నీటి కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ లు శ్రీలత రామ్మోహన్ రావు,కోలగాని సత్యం, క్యాదసు నవీన్, సిరికొండ రాజయ్య, వొంటిపులి రాము, ములసపు మహేష్, చిట్ల మనోహర్, రవి శంకర్,ఏఈలు అనిల్, శరన్ , టి పి ఓ శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.