Take a fresh look at your lifestyle.

79 కోట్ల 58 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నాలా విస్తరణ  పనులు

  • పీయేసీ చైర్మన్ అరికపూడి గాంధీ.

మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తార నగర్ కాలనీ లో గల సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి భీ. హెచ్. ఈ. ఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్  నాల వరకు నాల విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న  బాక్స్ డ్రైన్  నిర్మాణం పనులను, బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు  నాల విస్తరణ నిర్మాణం పనులను గౌరవ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్,  విభాగం అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన  చైర్మన్  ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఫేస్ 2 లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయలతో అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు చేపట్టడం తో  ఎన్నో ఏండ్ల వరద ముంపు సమస్య కు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని, దానిలో భాగంగా తార నగర్ కాలనీ లో గల సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు అలుగు నుండి భి. హెచ్. ఈ. ఎల్ చౌరస్తా గ్యాస్ గో డౌన్  నాల వరకు నాల విస్తరణ పనులు మరియు ఆర్. సి. సి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులు, బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు  నాల విస్తరణ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ,నాలా విస్తరణ పనులకు అందరూ సహకరించాలని , ఒక్కప్పుడు వరదలు వస్తే కంటి మీద కునుకు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళన తో ఇబ్బందులకు గురయ్యేవారు అని, కానీ నేడు  సమస్య లేకుండా మళ్ళీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది అని,ఈ రోజు పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని,నాలల విస్తరణ పనులతో  లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించింది అని ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యత లో విస్తరణ పనులు చేపట్టాలని, నాలల విస్తరణ పనులలో వేగం పెంచాలని, యుద్ధప్రాతిపదికన పనులుప్రారంభించాలని,అధికారులకు చైర్మన్ గాంధీ సూచించారు.నాల విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నాలల విస్తరణ పనులు సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పనులు చేపట్టాలని, ప్రధాన రహదారుల పై పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, నాలల విస్తరణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని, నాల విస్తరణ పనులు పై అధికారులకు పలు సలహాలు ,సూచనలు  ఇవ్వడం జరిగినది.

ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ మరియు, బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, పనులు పూర్తిచేయాలని అధికారులకు చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో  అధికారులు నిఖిల , యుగేందర్, పవన్  మరియుటౌన్ ప్లానింగ్ అధికారులు డిప్యూటీ సిటీ ప్లానర్ తులసిరామ్, జిషన్, సంతోష్ మరియు నాయకులు ,కార్యకర్తలు తదితర స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.