Take a fresh look at your lifestyle.

బైపీసీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినిని సన్మానించిన ప్రభుత్వ విప్

ధర్మపురి, ముద్ర : వెల్గటూర్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన ఐట్ల అమూల్య బైపీసీ ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు 434 సాధించింది.ఈ సందర్భంగా అమూల్యను ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించి సత్కరించారు. అమూల్య తండ్రి రామయ్య హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండగా ప్రమాదవ శాత్తు హార్వెస్టర్ పైనుండి కింద పడటంతో నడుము కింది భాగం చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు.ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన అమూల్యను సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చి హామీ కరీంనగర్ లోని ఓ ప్రముఖ ప్రైవేటు కళాశాలలో సొంత ఖర్చులతో చదివిస్తున్నారు. ఉత్తమ మార్కులు వచ్చిన సందర్భంగా అమూల్య కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ శాలువాతో అమూల్యాను సన్మానించి అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.