Take a fresh look at your lifestyle.

ఫ్లాష్…ఫ్లాష్….. గోపన్ వల్లి వద్ద రూ.57 లక్షలతో ఉడాయించిన సీఎంఎస్ డ్రైవర్

 
పలు బృందాలుగా ఏర్పడి శోదిస్తున్న గచ్చిబౌళి పోలీసులు

ముద్ర, శేరిలింగంపల్లి:
గచ్చిబౌలిలోని గోపన్ పల్లి వద్ద సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సీఎంఎష్ (క్యాష్ సప్లై మిషన్) సంబంధించి సుమారు 57 లక్షల రూపాయలు అపహరణకు గురయ్యాయి. గోపన్ పల్లి వద్ద యాక్సిస్ బ్యాంక్లో అమౌంట్ లోడ్ చేయడానికి వెహికిల్లో ఒక సెక్యూరిటీ గాడ్, ఇద్దరు కస్టోడియన్స్ లొ కలిసి గోపన్ పల్లికి వాహనంతో చేరుకున్నారు. కస్ట్డో డియన్స్ ఇద్దరూ డబ్బులు లోడ్ చేస్తుండగా డ్రైవర్ అజిత్ అలియాస్ శివ కష్టోడియన్ కళ్లు గప్పి వాహనంతో సహా పరారయ్యాడు. గాడ్ అప్పుడే వాష్రూమ్కి బయటకి వెళ్లగా అదే అదనుగా భావించిన డ్రైవర్ వాహనంతో సహా ఉడాయించాడు. తెల్లాపూర్ దగ్గర అబాండన్ చేసి ఈ క్యాష్ తీసుకొని పారిపోవడం జరిగింది. సీఎంఎస్ వాహనంతో డ్రైవర్ పరారయ్యే సమయంలో అందులో సుమారు 57 లక్షల రూపాయలు ఉన్నట్లు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందడంతో ప్రత్యేక టీంలు ఏర్పడి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని గచ్చిబౌలి సీఐ బాల్ రాజ్ తెలిపారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు తెల్లాపూర్ వద్ద వాహనాన్ని వదిలి డబ్బుతో పరారైట్లు తెలిపారు. డబ్బుల అపహరణలో డ్రైవర్ తో పాటు మరెవరైనా ఉన్నారా…గతంలోనూ ఇటువంటి సంఘటలను జరిగినందున ఏదైనా అనుభవం కలిగిన ముఠా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.