Take a fresh look at your lifestyle.

సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా పూజల గోపికృష్ణ నియామకం

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్‌గా సిద్దిపేటకు చెందిన యువనేత పూజల గోపికృష్ణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం అందజేశారు.చిన్న వయస్సులోనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పూజల గోపికృష్ణ ఎన్‌ఎస్‌యూఐలో అడుగుపెట్టి కళాశాల అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర స్థాయి పదవులు చేపట్టారు. విద్యార్థులు, యువత సమస్యలపై ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తూ ఢిల్లీలో లాఠీ దెబ్బలు తిన్నా, కేసులకు భయపడకుండా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుడిగా గుర్తింపు పొందారు.రైతులు, యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే గోపికృష్ణ గారు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసిన నాయకుడని పలువురు అభినందించారు.
ఈ సందర్భంగా తనకు ఈ బాధ్యత అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి గౌ వివేక్ వెంకటస్వామిఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ mla గౌ మైనం పల్లి హనుమంతన్న ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ గౌ పూజల హరికృష్ణ అలాగే కు సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, మహిళ కాంగ్రెస్, ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
ఆత్మ కమిటీ సభ్యులు 27 మంది పులగుర్ల రజిత, గణపురం సంతోషి, ఉమాదేవి, అఖిల, గూడెపు దేవలక్ష్మి, ఆ బాకీ సంగీత, బత్తుల స్రవంతి, ముతకాని పోచవ్వ, అదే రెడ్డి బాలయ్య, ఐరేని అంజిరెడ్డి, బొజ్జ రాజకుమార్, ఆడపు లక్ష్మీనారాయణ, మహమ్మద్ అజ్మత్ అలీ, రాకేష్ యాదవ్, సీత బాలు, బందెల కనకయ్య, మద్దూరి ఎల్లయ్య, ఎర్ర శ్రవణ్, నరాల బాబు, ఎర్రోళ్ల బాబు, బండి శివకుమార్, రాచకొండ కనకయ్య, అనురాజు నాగరాజు, ఉడుత ప్రశాంత్, గూడెంపు శ్రీనివాస్, శివరాత్రి తిరుపతి, పి వెంకటేష్,ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొమ్మల యాదగిరి, రాష్ట్ర మైనార్టీ నాయకులు కలిమోద్దీన్, ఎర్ర మహేందర్, చెంది శ్రీనివాస్, అశోక్, అమర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.