ముద్ర,పానుగల్: పానుగల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998–1999 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు మంగళవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.మండల కేంద్రంలోని కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా నాటి గురువులకు పూర్వ విద్యార్థులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానం చేసి మెమెంటో లను అందజేశారు.నాటి గురువులతో విద్యాబోధనను స్వీకరించుకున్న విద్యార్థులు నేడు వివిధ హోదాలలో ఉద్యోగాలను,ఇతరత్రా పనులను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఒకరినొకరు పరిచయం చేసుకుని సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.ఆత్మీయ సమ్మేళనాలు నాటి మధుర జ్ఞాపకాలను స్మరించుకోవడం జరుగుతుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేషారు.ఈ కార్యక్రమంలో నాటి గురువులు దామోదర్ రెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, సూర్యనారాయణ రావు, మహమ్మద్ యాఖూబ్ అలీ , భద్రాశెనయ్య, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
