Take a fresh look at your lifestyle.

జిల్లాలో ప్రశాంతంగా మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఏకగ్రీవంగా ఎన్నికై, ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించిన 17 వ వార్డు కౌన్సిలర్, గడ్డం అనన్య. (వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె ) ముందుగా నూతనంగా ఎన్నికైన 34 మంది వార్డు కౌన్సిలర్లతో ఇంచార్జి ఎన్నికల అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వైస్ చైర్మన్ గా 10 వ వార్డు కౌన్సిలర్ అర్ధ సుధాకర్ రెడ్డిని ఎన్నుకున్న కౌన్సిలర్లు. ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో సమావేశానికి హాజరైన వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య, వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశాంతంగా వికారాబాద్ మున్సిపల్ ప్రత్యేక సమావేశాలు
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిశానిర్దేశం కట్టుదిట్టమైన ఏర్పాట్లు సభ్యులతో ప్రమాణ స్వీకారం చే సిన వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిశా యి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్/వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వికారాబాద్ మున్సిపల్ సమావేశానికి అదనపు కలెక్టర్ సుధీర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, కొడంగల్ మున్సిపాలిటీకి అదనపు కలెక్టర్ రాజేశ్వరి, తాండూర్ మున్సిపాలిటీ కి డి ఆర్ ఓ మంగీ లాల్, పరిగి మున్సిపాలిటీకి ఆర్ డి ఓ వాసు చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ మందిరాలలోకి చేరుకోగా, తెలుగు అక్షరమాలను అనుసరిస్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారులు ముందుగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఎక్స్ అఫీషియో సభ్యులుగా హోదా కలిగిన ఎమ్మెల్యేలు సైతం స్పెషల్ మీటింగ్ లకు చైర్ పర్సన్/ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలో పాల్గొన్నారు. మద్యాహ్నం 12.30 గంటలకు సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. వికారాబాద్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం అనన్యను బలపర్చారు. దీంతో అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి క్షేత్రస్థాయిలో స్వీయ పర్యవేక్షణ జరుపుతూ, ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనలను తు.చ తప్పకుండా పాటిస్తూ, వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు. ఇదే తరహాలో కొడంగల్ మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్ ఎం ప్రశాంత్ కుమార్,వైస్ చైర్ పర్సన్ గా మూడవత్ శంకర్, పరిగిలో మున్సిపల్ చైర్ పర్సన్ గా కుడుముల రజిత, వైస్ చైర్ పర్సన్ గా హనుమంతు, తాండూర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ గా పట్టొళ్ల నీరజ,వైస్ చైర్ పర్సన్ గా అబ్దుల్ రాజాక్ లను ఎన్నుకున్నారు. చైర్ పర్సన్ ల ఎన్నికను పురస్కరించుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వికారాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసు అధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.

Leave A Reply

Your email address will not be published.