Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇళ్ళ కోసం, అర్హులైన ఇల్లు లేని పేద వారిని గుర్తించండి

  • హౌసింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రెటరీ వి.పి గౌతమ్.

ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకం లో భాగంగా తుక్కుగూడ మునిసిపాలిటిలో మంగళవారం 8వ వార్డ్ మంఖాల్,10 వ వార్డు తుక్కుగూడలో,మహేశ్వరం మండలంలోని సిరిగిరి పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల యొక్క ఎంపిక జరుగుతున్న తీరును, ఇప్పటివరకు వరకు సేకరించిన లబ్ధిదారుల వివరాలఐ ఇంటిఇంటికి తిరిగి తనిఖీ చేసారు.అదేవిధంగా ఈ సందర్బంగా స్పెషల్ సెక్రెటరి లబ్దిదారులతో మాట్లాడం జరిగినది.ఇట్టి పరిశీలనలో లబ్దిదారుల యొక్క కుటుంబ ప్రస్తుత నివాస స్థితిగతులు, వారి ఆర్థిక పరిస్థితులు మరియు లబ్దిదారుల ఎంపిక వివరాల గురించి తెలుసుకోవడం జరిగింది.ఈ సందర్బంగా స్పెషల్ సెక్రెటరి గౌతమ్ లబ్ధిదారులతో మాట్లాడుతూ నిజమైన లబ్దిదారులని ఇంటి దగ్గరే అధికారులు వచ్చి వాళ్ళ వివరాలను సేకరించి ఎంపిక చేస్తారని తెలిపారు.అదేవిధంగా అర్హులైన ఇల్లు లేని పేద వారిని గుర్తించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్ పాల్గొని మాట్లాడుతూ ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి ఖచ్చితమైన సర్వే చేసి ప్రభుత్వానికి మరియు జిల్లాకి మంచి పేరు తీసుక రావాలని అధికారులను ఆదేశించారు.ఇట్టి కార్యక్రమలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ధరావత్ చంప్లా నాయక్, తుక్కుగూడ మునిసిపాలిటి కమిషనర్ వాణి, మహేశ్వరం తహశీల్దార్ సైదులు, మహేశ్వరం ఎంపిడిఓ కే శైలజ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.