Take a fresh look at your lifestyle.

పేకాట స్థావరంపై మెరుపు దాడి

తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామ శివారులో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
శుక్రవారం నాడు వాసాలమర్రి గ్రామ శివారులోని ఖాళీ స్థలంలో పేకాట జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంతో తుర్కపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ తక్యుద్దీన్ తమ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో మెడ్చల్‌కు చెందిన పెంజెర్ల రాజేందర్, దేవరి వేణు రాజ్, కామారెడ్డికి చెందిన కోరంపల్లి సతీష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మరికొంతమంది పేకాట రాయుళ్లు పరారయ్యారు.
అరెస్టైన వారి వద్ద నుండి రూ.2,07,000/- నగదు, మూడు కార్లు, రెండు సెట్‌ల పేక ముక్కలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా తుర్కపల్లి ఎస్‌ఐ మాట్లాడుతూ, కాశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి, లక్ష్మణ్ సహకారంతో వాసాలమర్రి గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రదేశంలో మరికొంతమంది వ్యక్తులతో కలిసి పేకాటను ఆర్గనైజ్ చేస్తున్నట్లు తెలిపారు.
పేకాట ఆడినా, పేకాట నిర్వహించినా లేదా ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.