Take a fresh look at your lifestyle.

శివనామ స్మరణతో… భక్తజనసంద్రమైన కీసర గుట్ట

 

ముద్ర ప్రతినిధి,మేడ్చల్ జిల్లా:

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్త జనసంద్రమైంది. తెల్లవారుజామున నుండే భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శివరాత్రి సందర్బంగా కీసర గుట్ట పరిసరాలు భక్తుల శివనామ స్మరణతో మార్మోగు తున్నాయి.మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, మేడ్చల్ శాసన సభ్యుడు,మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు,ఇతర వీ ఐ పీ లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అడుగడుగునా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. అయితే భక్తులు ఓకే సారి పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో కొద్ది సేపు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడిపారు.

Leave A Reply

Your email address will not be published.