Take a fresh look at your lifestyle.

నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి:
భువనగిరి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.00 గంటలకు భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంచి వాతావరణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక, కౌన్సిలర్ల కు ప్రమాణ స్వీకారం మున్సిపల్ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను తప్ప కుండా పాటించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ కు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామలింగం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.