Take a fresh look at your lifestyle.

స్పోర్ట్స్ స్కూల్లో బాల బాలికల ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి.
జిల్లా కలెక్టర్ సంగారెడ్డి గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్, కరీంనగర్, ఆదిలాబాద్ మరియు హన్మకొండ లో నాలుగవ తరగతి లో ప్రవేశం కొరకు వయస్సు సెప్టెంబర్ 1,2017 నుండి 31 ఆగస్టు 2018 మధ్య పుట్టి
31 ఆగస్టు 2026 వరకు 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలబాలికలకు మండల స్థాయి ఎంపిక ప్రక్రియ ఈనెల13 నుండి 17 వరకు జరిగినది. మండల స్థాయి లో గెలుపొందిన బాలబాలికలకు జిల్లా స్థాయి ఎంపిక ప్రక్రియ ఈనెల 30 న డా. బి.ఆర్. అంబేద్కర్ స్టేడియం, సంగారెడ్డి నందు ఉదయం 9.00 గం.లకు ప్రారంభమవుతుంది కావున మండల స్థాయిలో ఎంపిక కాబడినటువంటి బాలబాలికలు హాజరు కాగలరని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు.
వెంట తీసుకురావలిసిన ధ్రువీకరణ పత్రాలు.
ఆధార్ కార్డ్ ఒరిజినల్
, 3 వ తరగతి బోనఫైడ్ ప్రస్తుతం చదువుతున్న పాఠశాల నుండి,
పుట్టిన తేదీ దృవపత్రం,
ప్రోగ్రెస్ రిపోర్ట్ 3 వ తరగతిది,
కమ్యూనిటీ సర్టిఫికెట్స్,
పాస్ పోర్ట్స్ సైజు ఫొటోలు 5,
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు మార్క్స్ షీట్.
మిగతా వివరాలకు జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయం, సంగారెడ్డి ఫోన్ నెం. 7981798957 సంప్రదించగలరని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.