కోరుట్ల/మెట్పల్లి, ముద్ర విలేకరి: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ఒకరి మృతి చెందిన ఘటన మెట్పల్లి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వెంకట్రావుపేట శివారులోని సిరి పిల్లల హాస్పిటల్ ముందు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. బెజ్జారాపు లక్ష్మీ నరేందర్ అనే వ్యక్తి అతని స్నేహితునితో కలిసి బైక్ పై వెంకట్రావుపేట వెళ్తుండగా ఎదురుగా మరొక ద్విచక్ర వాహనంపై సంతోష్ అనే వ్యక్తి మెట్టుపల్లి వస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో లక్ష్మీ నరేందర్ కిందపడ్డాడు. అదే సమయంలో వెంకట్రావుపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ నరేందర్ తల పైనుండి వెళ్ళడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుని తండ్రి బెజ్జరపు స్వరూప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.