Take a fresh look at your lifestyle.

నియోజవర్గంలోని పలు శివాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్న ఛైర్మన్ అరికెపూడి

ముద్ర, శేరిలింగపల్లి:
మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు శివాలయాల్లో జరుగుతున్న ఉత్సవాల్లో పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ పరమశివుని ఆశిస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు. శివుడికి అతి పవిత్రమైన రోజున ఆయనకు పూజలు చేయడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని హైదర్ నగర్ హెచ్ఎంటి కాలనీ రామాలయంలో గల శివాలయంలో తాజా మాజీ కార్పోరేటర్ నార్నే శ్రీనివాసరావుతో కలిసి పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర కాలనీ ఇందాహిల్స్ లోని శివాలయాల్లో తాజా మాజీ కార్పోరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, దొడ్ల వెంకటేశ్ గౌడ్ తో కలిసి పూజలు నిర్వహించారు. కూకట్ పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ కాలనీలో వీరాంజనేయ ఆలయంలో, వివేకానందనగర్ డివిజన్ లోని బాగ్ అమీన్ పూర్ బాలాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన అభిషేకంలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.