Take a fresh look at your lifestyle.

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్, ఇంటర్మీడియట్ అధికారి రమణి అధ్యక్షతన చీఫ్ సూపరింటెండెంట్ లకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ లకు శిక్షణ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది .
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరముల వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండాప్రతి కేంద్రములో త్రాగు నీరు, వెలుతురు మంచిగా ఉండేటట్లు, ప్రతి క్లాస్ రూమ్ లో గోడ గడియరాలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబందించిన కన్వీనర్, జిల్లా పరీక్షల కమిటీ జిల్లా డిస్ట్రిక్ట్ బల్క్ ఫ్లైయింగ్ Urgently సిట్టింగ్ స్క్వాడ్ లను ఆదేశించారు. ఎటువంటి అవకతవకలు జరిగిన Dispatch చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.