Take a fresh look at your lifestyle.

కాళేశ్వరం స్కాం నుంచి బయటపడేందుకు ఏకమయ్యారు

  • ఈటల, హరీశ్​ రావు ఫాం హౌజ్​ లో కలిశారు.
  • అక్కడ రహస్య మంతనాలు చేశారు.
  • ఈటల బీజేపీలో ఉన్నా మనసంతా బీఆర్​ఎస్​ లోనే ఉంది.
  • బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీకి అడ్డుగా ఉన్న బండిని పదవి నుంచి తప్పించారు.
  • మీడియాతో టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్​ నుంచి నోటిసులు రాగానే కేసిఆర్, ఈటలకు పాత బంధం మళ్లీ చిగురుఇచ్చిందని టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​, హరీశ్ రావు, బీజేపీ ఎంపి ఈటల రాజేందర్​ ఆ గండం నుంచి బయటపడేందుకు ఏకమయ్యారని చెప్పారు.కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేపడుతోన్న జస్టిస్​ పీసీ ఘోష్​ కమిటీని తప్పించుకునేందుకు రహస్య మంతనాలు మొదలుపెట్టారని ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం విచారణ కమిటీ నుంచి నోటీసులు అందుకున్న తర్వాత హరీష్ రావు, ఈటలతో ఫోన్లో మాట్లాడారని మహేశ్​ కుమార్​ చెప్పారు.తర్వాత వారిద్దరూ శామీర్ పేటలోని ఈటల ఫాంహౌస్ లో కలుసుకున్నారన్నారు. అక్కడ రహస్యంగా ఏం మాట్లాడుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అసలు బీజేపీలో ఉన్నారా.. బీఆర్ఎస్ లో ఉన్నారా అని పార్టీ చీఫ్​ ప్రశ్నించారు. ఆయన మనసంతా గులాబీ పార్టీ మీదనే ఉన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ గురించి కవిత ఇప్పుడు బయటపెట్టారన్నారు. కానీ ఈ స్నేహానికి అడ్డుగా ఉన్నాడని బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించారని చెప్పారు. గులాబీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందని తాము ఎప్పుడో చెప్పామన్నారు. ఇపుడు పంపకాలు సాగక బయట పడ్డాయని మహేష్ కుమార్ గౌడ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కవిత ,రాజా సింగ్ వ్యాఖ్యల్ని పోల్చి చూస్తే బీజేపీ లో బీఆర్ఎస్ విలీనం తథ్యమనిపిస్తోందన్నారు. రాజా సింగ్ ,కవిత వ్యాఖ్యలతో ముడుపులు, జేపీ బిఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం గుట్టు వీడిందని చెప్పారు.బీజేపీ లో కవిత చేరికను ఉద్దేశించి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పే దమ్ముందా అని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డిని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ముందుగా తమ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. రాహుల్ గాంధీ పై అవకాలు చెవాకులు పేల్చుతోన్న బీజేపీ నేతలు తమ నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు.రాహుల్ గాంధీ సైనికులకు బాసటగా నిలిస్తే విమర్శలు చేయడం బీజేపీ నేతల దిగజారుడు తనానికి నిదర్శనమని చెప్పారు. పాక్ పై యుద్ధంలో సాధించింది ఏమిటి? కోల్పోయింది ఏమిటి? అని దేశ ప్రజలు అడుగుతున్నారన్నారు.బీఆర్​ఎస్​ ప్రస్తుతం మునిగిపోయిన నావ అని చురకలంటించారు. నావాలో ఉన్న వస్తువులు( డబ్బుల) కోసం కేసిఆర్ కుటుంబంలో కొట్లాట జరుగుతోందన్నారు. ఎనిమిది సీట్లు ఉన్న బీజేపీ తో కలిస్తే బిఆర్ఎస్ కూడా ఎనిమిది స్థానాలకు పరిమితమవుతుందని జోస్యం చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.