- ఎర్రవల్లిలో కేసీఆర్ తో సమావేశమైన హరీశ్.
- మూడు గంటలకుపైగా చర్చలు.
- కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్లే సమయం దగ్గర పడుతుంది.
- కవిత అంశంలోనూ చర్చలు.
- నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమనే సంకేతాలు.
- పిలిచి మాట్లాడాలని ప్రాథమికంగా నిర్ణయం.
- పిలిచి బుజ్జగించే ప్రయత్నాలు హరీశ్ రావుకు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో పార్టీ అధినేత కేసీఆర్ తో మళ్లీ మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు.కేవలం వారం రోజుల వ్యవధిలోనే వారిద్దరు నాలుగు సార్లు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చంశనీయంగా మారింది. కాళేశ్వరం కమిషన్ జారీ చేసిన నోటీసుల విచారణకు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీశ్ రావులు వరుస భేటీ అవుతున్నారు.ఇప్పటికే మూడుసార్లు కలువగా శుక్రవారం కూడా సుమారు మూడున్నర గంటల పాటు ఇద్దరూ చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశంలో ఏ అంశాలపై లోతుగా చర్చించారన్న అంశం ప్రస్తుతం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వైపు కమిషన్ ముందు వచ్చే నెల 5 న కేసీఆర్, 9న తేదీన హరీశ్ రావులు హాజరుకావాల్సి ఉంది.ఈ కమిషన్ ముందు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలని వారిద్దరు సతమతమవుతున్న పరిస్థితుల్లో తాజాగా కవిత పెట్టిన లేఖ చిచ్చు మరింత ఉపద్రవం ముంచుకొస్తున్నట్ల్లే కనిపిస్తోంది.దీంతో ఈ రెండు అంశాలపైనే వారిద్దరు ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణిక్యుడుగా పేరొందిన కేసీఆర్, ట్రబుల్ షూటర్ హరీశ్‌రావులు కలిసి కాళేశ్వరం కేసు నుంచి ఎలా బయటపడాలా? అని వ్యూహాలు రచిస్తున్నారని పార్టీ వర్గల్లో వినిపిస్తోంది. ఈ కేసు తీవ్రత కూడా కనిపిస్తుండడంతో ఏ మాత్రం అలక్ష్యగా ఉన్న ఉచ్చు గట్టిగానే బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కమిషన్ ముందు వినిపించాల్సిన అంశాలపై ఒకటి, రెండు సార్లు లోతుగా సమాలోచనలు చేశారని తెలుస్తోంది.ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణపై లోతుగా సమీక్షించినట్టు సమాచారం.ముఖ్యంగా కాళేశ్వరంపై ఎన్ డిఎస్ ఎ ఇచ్చిన రిపోర్టును ప్రాజెక్టును నిర్మించిన ఎల్ అండ్ టి సంస్థ తప్పుబడుతూ ఇటీవలే లేఖ రిలీజ్ చేసింది. ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా బ్యారేజీపై రిపోర్ట్ ఎలా ఇస్తారన్న ఎల్ అండ్ టీ వాదననే తాము కూడా కమిషన్ ముందు ప్రస్తావించాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రాజెక్టు శంకుస్థాపన నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు జరిగిన ప్రక్రియనంతా వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కమిషన్‌ను కేసీఆర్ కోరనున్నట్టు తెలుస్తోంది. తదనంతరం కవిత లేఖ అంశంపై కూడా చ ర్చించారని సమాచారం.కొద్ది రోజులుగా కవిత చేస్తున్న విమర్శలు సంధిస్తున్న ప్రశ్నలకు ఏ మేరకు పార్టీకి నష్టం కలిగిస్తాయన్న అంశంపై కూడా కేసీఆర్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుటికిప్పుడు ఆమె పై చర్యలు తీసుకోవడం కంటే, ఒకసారి కవితను పిలిపి మాట్లాడితే పరిస్థితి అంతా చక్కబడే అవకాశాలు ఉందని ప్రాథమిక నిర్ణయానికి కేసీర్ వచ్చారని సమాచారం. అయితే ఈ బాధ్యతను కూడా కేసీఆర్ హరీశ్ రావుకే అప్పగించారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే కవితతో నేరుగా మాట్లాడిన అనంతం ఆమెపై చర్యలు తీసుకునే అంశాన్ని కేసీఆర్ పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది.మొత్తానికి వచ్చే నెల మొదటి వారంలో గులాబీ రాజకీయాలు మారింత హెటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే పరోక్షంగా కేటీఆర్ విమర్శలు దాడిని కొనసాగిస్తున్న కవిత సంధికి వస్తారా? లేక తన దారి రహదారి అని పార్టీ నుంచి బయటకు పోతారా అన్నది మరో నాలుగైదు రోజుల్లో తేలనుంది. అప్పటి వరకు ఈ సస్సెన్ ఎపిసోడ్ అనేక రాజకీయ మలుపులు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది.
Prev Post