Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్​కు బెయిల్

  • మరో నిందితుడు ప్రణీత్ రావుకు దక్కని బెయిల్

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు మాజీ డీసీసీ రాధా కిషన్, మాజీ అదనపు ఎస్పీ భుజంగరావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే పాస్​పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. తాజాగా రాధాకిషన్, భుజంగరావుకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఉన్న ప్రణీత్ రావు మత్రమే ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరైంది. అలాగే ఈ కేసులోని మరో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నకు కూడా సుప్రీంకోర్టు ఈనెల 28న బెయిల్ మంజూరు చేసింది.

ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్‌‌ అరెస్ట్‌‌ చేసింది. దీంతో 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్న బెయిల్​పై విడుదలయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్‌‌ దాఖలు చేశారు. అనంతరం బెయిల్‌‌ ఆర్డర్‌‌‌‌ను చంచల్‌‌గూడ జైలు అధికారులకు అందించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు మాత్రం బెయిల్ లభించలేదు. ప్రస్తుతం ప్రణీత్ రావు చంచలగూడ జైలులోనే ఉన్నాడు. ఆయన తరపు న్యాయవాదులు సమర్పించిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు పలుమార్లు తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌రావును మన దేశానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్‌‌లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.