రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : గాంధారి మైసమ్మ బోనాల జాతరకు వచ్చే భక్తులు తమకు నిర్దేశించిన స్థలాలలో వాహనాలను పార్కింగ్ చేసి పోలీసులకు సహకరించాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపారు. శనివారం స్థానిక గాంధారి మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర సందర్భంగా బందోబస్తు నిర్వహించే పోలీస్ సిబ్బందికి పలు సూచనలు తెలియజేశారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లు శశిధర్ రెడ్డి,ఆకుల అశోక్,హనూక్,ఎస్సైలు పాల్గొన్నారు.