Take a fresh look at your lifestyle.

పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలి : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో
ఈ నెల 11 న జరిగే పోలింగ్ ప్రక్రియ ని సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు అన్నారు.
మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించారు.మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బంది కి ఎన్నికల సామాగ్రి పంపిణి నిమిత్తం మెటీరియల్ పంపిణి ప్రక్రియను , భోజనం,ఏర్పాట్లn ను పరిశీలించి తగుసూచనలు చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, లైటింగ్, త్రాగునీరు, లంచ్, డిన్నర్ ఏర్పాట్లుబాగుండాలని, సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు పోలింగ్ కేంద్రాలకు చేర్చుట గాను ఎస్కార్ట్ వాహనంతో వెళ్లాలని, బ్యాలెట్ బాక్స్ లు సరిగ్గా ఉన్నాయా లేవో సరిచూసుకోని సిబ్బందికి ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
పకడ్బందీగా పోలింగ్ జరగాలి, దానికి అనుగుణంగా జిల్లాలోని 6 మున్సిపాలిటీలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.పోలింగ్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రానికి సంబందించి అన్ని సామగ్రిని ఇక్కడే పరిశీలించి జాగ్రతగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలి అన్నారు.రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియని ప్రారంభించాలి .ఈ రోజు రాత్రి పోలింగ్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి
చేయాలన్నారు.ఓటర్ లు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఈ మున్సిపల్ క్ష ఎన్నికల్లో కూడా మన జిల్లాలో 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలి అని అన్నారు.ప్రతీ పోలింగ్ స్టేషన్ లో జరుగుతున్న పోలింగ్ తీరు ను నిశితంగా పరిశీలించాలని…. ఏమైనా సమస్య లు గమనిస్తే.. వెంటనే తమ దృష్టి కి తీసుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.