Take a fresh look at your lifestyle.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి…

 

– ఎమ్మెల్యే హరీష్ రావు ద్రుష్టి కి తీసుకెళ్తాం, రైతు లకు అండగా ఉంటాం..

– సిద్దిపేట అర్బన్ మండలం లో పంట నష్టపోయిన గ్రామాల్లో పర్యటించి బి ఆర్ ఎస్ నాయకులు…

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి, కృష్ణ సాగర్, పొన్నాల గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షాలు, వడ గండ్ల వానలకు జరిగిన పంట నష్టం, తడిచిన ధాన్యాన్ని మండల బి ఆర్ ఎస్ నాయకులు పరిశీలించారు.. అర్బన్ మండలం సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు బాలకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ అల్లం ఎల్లం, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దు యాదగిరి లు ఆయా గ్రామాల సర్పంచ్ లతో కలసి పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు నిన్న కురసిన అకాల వర్షాలలు రైతు లకు తీవ్ర నష్టం జరిగిందని, అందోళన లో ఉన్న రైతు లను కలసి మనోధైర్యాన్ని ఇచ్చారు. చేతికొచ్చిన పంట నేల పాలయిందని ఆవేదన చెందారు. ఈ విషయం హరీష్ రావు గారి ద్రుష్టి కి తీసుకెళ్లామని అధికారులతో మాట్లాడి అన్ని విధాలుగా అదుకుంటామని చెప్పారు. వ్యవసాయ అధికారలతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక పంపాలని వారు కోరారు.. అదేవిదంగా రైతు లు ఎవరు అందోళన చెంద్దోద్దని అధైర్య పడొద్దని చెప్పారు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అదేవిదంగా ఎన్సాన్ పల్లి, పొన్నాల గ్రామాల్లో తడిచిన వరి ధాన్యాన్ని పరిశీలించారు వెంటనే కొనుగోలు చేయాలని ప్రతి గింజను కొనాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం సర్పంచ్ లు నాగుల ప్రశాంత్ గౌడ్, నరేందర్, వెంకటయ్య, నాయకులు నర్సయ్య,సంపత్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.