రామకృష్ణాపూర్, ముద్ర : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు.శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి,జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్,మాజీ చైర్ పర్సన్ జంగం కళ,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,అబ్దుల్ అజీజ్, పలిగిరి కనకరాజు,గోపు రాజం,సురేందర్,సునీత,సృజన,రాజేశ్వరి,శారద తదితరులు పాల్గొన్నారు.