- తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే చేసిన సేవలు మరువలేనివని జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.అణగారిన వర్గాల ఆశాజ్యోతి, మహిళా విద్యకు మార్గదర్శకుడు, వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని ధారపోసిన జ్యోతిబాఫూలే అని కొనియాడారు.