Take a fresh look at your lifestyle.

ఏదులాపురం మున్సిపాలిటీలో ఖాతా తెరిచిన కాంగ్రెస్

– 15వ వార్డు ఏకగ్రీవంగా సొంతం చేసుకున్న తమ్మినేని మంగతాయి
ముద్ర ప్రతినిధి, ఖమ్మం
ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీ 15వ వార్డును ఏకగ్రీవంగా కాంగ్రెస్ అభ్యర్థి తమ్మినేని మంగతాయి సొంతం చేసుకున్నారు.
ఈ నెల 11 వ తారీకున జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 32 వార్డులు కలిగి ఉండగా అందులో తెల్దార్ పల్లికి చెందిన 15వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున తమ్మినేని మంగతాయి పోటీ చేశారు. నామినేషన్ల గడువు ముగుస్తుండగా బిఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం అభ్యర్థి తమ్మినేని విజయ ఎన్నికల పోటీ నుండి వైదొలగడం. పోటీలో ఉన్న ఇతర బిజెపి అభ్యర్థి కూడా పోటీ నుండి తన మినేషన్ ను ఉపసంహరించుకోవడంతో తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా 15వ వార్డు అభ్యర్థిగా ఎన్నికైనట్లు అయింది. దీనితో 32 వార్డులు కలిగిన ఏదులాపురం మున్సిపాలిటీ లో ఒక వార్డు కాంగ్రెస్ ఖాతాలో చేరినట్లు అయింది.
ఏకగ్రీవంగా 15వ వార్డుకు తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకొని టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.