గుండ్లపోచంపల్లి లో శ్రీ రాజరాజేశ్వర స్వామి, శివ పంచాయత, శ్రీ సీతారామచంద్ర స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ శిఖర సిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు.
ఈ సందర్భంగా ఆయన వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమాన్ని దర్శించారు. భక్తులతో కలిసి హారతులు అందుకుని దేవతల ఆశీస్సులు పొందారు. ఆలయ నిర్మాణం, శిఖర ప్రతిష్ట వంటి పవిత్ర కార్యక్రమాలు గ్రామ అభివృద్ధికి, ఆధ్యాత్మిక చైతన్యానికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, విక్రమ్ రెడ్డి, గోపు రమణ రెడ్డి, దొడ్ల మల్లికార్జున్, కృష్ణ గౌడ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.