ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ వాస రాఘవేందర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “365 రోజులు – 365 కార్యక్రమం”లో భాగంగా 100వ రోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. హోమియో దినోత్సవాన్ని పురస్కరించుకొని హోమియో వైద్యురాలు డా. పాపిశెట్టి లక్ష్మణ్ ను సన్మానించారు.
ఈ సందర్భంగా 100 మహాత్ముల జీవిత చరిత్రల పుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాలెం మరియు లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, నాగర్ కర్నూల్ విద్యార్థులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో క్లాస్మేట్ లో ఫౌండర్ వాస రాఘవేందర్ స్టేట్ ప్రెసిడెంట్ వై. పరమేశ్వరయ్య, స్టేట్ సెక్రటరీ కె.పి. ప్రసాద్, మరియు క్లాస్మేట్ క్లబ్ సభ్యులు పాలెం జూనియర్ కళాశాల లెక్చరర్ నరసింహ, లిటిల్ ఫ్లవర్ పాఠశాల ప్రతినిధి రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.