Take a fresh look at your lifestyle.

EAPCET-2026లో “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం 32 మంది టాప్‌-1000 ర్యాంకులు.. 450 మంది IIT అడ్వాన్స్‌డ్‌కు అర్హత

 

ముద్ర, కరీంనగర్‌:

EAPCET-2026 ఫలితాల్లో “అల్ఫోర్స్” విద్యాసంస్థలు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.

D.Rithwik 11th Rank

అగ్రికల్చర్‌ మరియు ఫార్మసీ విభాగంలో డి. రిత్విక్‌ 11వ ర్యాంకు సాధించి సంస్థకు అత్యున్నత స్థానం తీసుకురాగా, ఇంజినీరింగ్‌ విభాగంలో పి. చరణ్‌ 22వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటాడు. అలాగే సీహెచ్‌. లక్ష్మీహసిని 74వ ర్యాంకు, నిదా 157వ ర్యాంకు, పి. అక్షయ 251, ఎల్‌. అర్యన్‌రావు 252, మహ్మద్‌ హుస్సేన్‌ 272, వి. రుచిత 293, ఏ. నాగసింధు 330, బి. అభిఘ్న 430, వి. సుహాసిని 439, వి. శ్రేయస్‌రెడ్డి 487, జై నయన్‌ 505, జి. చైత్ర 506, బి. లిఖిత్‌సాయి 538, ఎల్‌. అనంతసాయి 543, కె. అక్షిత 555, జి. లాస్యారెడ్డి 614, జి. హర్షిత 637, టి. హర్షిత 697, టీ. సహస్ర 739, జె. జస్రిత్సాయి 745, డి. విశ్వతేజ 772, ఎం. సిరిమణి 814, సయ్యద్‌ మలాజోద్దిన్‌ 836, షరిన్‌ ఫాతిమా 898, కె. ధనుష్‌ 904, పి. చందన 905, ఎన్‌. జస్వంత్‌సాయి 921, కె. అక్షయ 951, ఎల్‌. ప్రణయని 954, ఎన్‌. రత్నప్రకాశ్‌ 961 ర్యాంకులు సాధించి అల్ఫోర్స్‌కు ఘనత తీసుకొచ్చారు.ఈ ఏడాది EAPCET ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 32 మంది విద్యార్థులు టాప్‌-1000 ర్యాంకులు సాధించగా, 57 మంది టాప్‌-2000లో, 88 మంది టాప్‌-3000లో, 127 మంది టాప్‌-4000లో, 169 మంది టాప్‌-5000లో స్థానం సంపాదించారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులతోనే అత్యధిక టాప్‌ ర్యాంకులు సాధించడం అల్ఫోర్స్ ప్రత్యేకతగా నిలిచిందని సంస్థ పేర్కొంది.

P.charan 22nd Rank
P.charan 22nd Rank

 

ఇటీవల విడుదలైన IIT-JEE మెయిన్‌ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని, 450 మంది విద్యార్థులు IIT అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడం మరో సంచలనమని సంస్థ చైర్మన్‌ డా|| వి. నరేందర్‌రెడ్డి తెలిపారు. పటిష్ట ప్రణాళికతో కూడిన బోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల కృషి వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

రాబోయే IIT అడ్వాన్స్‌డ్‌, NEET ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని ఆయన అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.