Take a fresh look at your lifestyle.

అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

ర్యాలీ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగులాంబ జోన్-7 DIG, ఎల్.ఎస్.చౌహాన్, ఐపీఎస్

ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. శనివారం
మహబూబ్ నగర్ పట్టణంలోని హనుమాన్ జయంతి కన్నులపండువగా సాగింది. ర్యాలీకి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లను జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహన్, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ, “హనుమాన్ జయంతి ర్యాలీ ఒక పెద్ద ప్రజా సమాహార వేడుక. ప్రజలు పెద్దఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నందున, భద్రత పరంగా ఎలాంటి రాజీపడకుండా ఏర్పాట్లు చేయాలని జోన్ పరిధి నందు గల అందరూ ఎస్పీ లకు మరియు సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశించాం. అని తెలిపారు. ప్రతి ప్రాంతాన్ని పర్యవేక్షించేలా సీసీ కెమెరాల సాయంతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం అని , అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం” అని అన్నారు.

అలాగే, ప్రజల సహకారం అవసరం అని తెలియజేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ నందు ర్యాలీ జరిగే అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలను మోహరించాం. శాంతి భద్రతలకు ఎటువంటి భంగం జరుగకుండా ఉండేందుకు పోలీస్ విభాగం అప్రమత్తంగా పనిచేస్తోంది. ఎవ్వరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి. జానకీ మాట్లాడుతూ, “బందోబస్తులో మహిళా పోలీస్ సిబ్బంది, ప్రత్యేక విభాగాలు, QRT బలగాలు, ట్రాఫిక్ పోలీసులు కలిసి సమన్వయంగా పనిచేస్తున్నాం. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ర్యాలీలో పాల్గొనగలిగేలా చక్కటి పర్యవేక్షణ ఏర్పాటు చేశాం‌ అని అన్నారు. ర్యాలీ మార్గంలో ట్రాఫిక్ డైవర్జన్, అత్యవసర టీమ్స్ కూడా ఏర్పాటు చేశాం” అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి , హిందు వాహి ని కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.