ముద్ర, మోత్కూర్:
అడ్డగూడూర్ , మోత్కూర్ మండలాల రెండవ విడత దళిత బంధులో భాగంగా లబ్దిదారుల ఖాతాలో ఉన్న 3 లక్షలతో పాటు మిగతా 7 లక్షలు డబ్బులు కలిపి వెంటనే గ్రౌండింగ్ చేసి లబ్దిదారులకు అందచేయ్యాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కు లబ్దిదారులతో కలసి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిపల్లపల్లి మహేంద్రనాథ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ వినతిపత్రం అందచేరు. బాధితుల గోడు వివరించాగానే స్పందించిన కలెక్టర్ , ఈ డి ని వెంటనే గ్రౌండింగ్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు .ఈ కార్యక్రమంలో దళిత బంధు లభిదారులు చెడిపల్లి రఘపతి,బంగారయ్య, అంజయ్య, మహేందర్ కూరెళ్ళ రమేష్, బాలెంల నరేందర్, జిల్లా శివాజీ, జక్కుల గిరి,ఇటీకాల సుధాకర్,కూరెళ్ళ మహేష్, కూరెళ్ళ నాగరాజు,రుద్రపల్లి గణేష్, బండి వెంకన్న, సూరారం రాజు,ముక్కెర్ల రమేష్,మెంట ఎల్లయ్య,చెడిపెల్లి ఆనంద్, కడియం స్వామి, తదితరులు పాల్గొన్నారు..