Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ , కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుంది

రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే అన్ని మున్సిపాలిటీ , కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతుంది

కోదాడ పట్టణాన్ని చరిత్రలో నిలబడే విధంగా అభివృద్ధి చేస్తున్నాం

దేశంలో సన్నబియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

మీ ఉత్తమన్న రాష్ట్ర మంత్రిగా ఉత్తమంగా పని చేస్తున్నాడు

ముద్ర ప్రతినిధి , కోదాడ ……. తెలంగాణ రాష్ట్ర ఆహార పౌరసరఫరాలు , నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం కోదాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోదాడ , హుజూర్ నగర్ , నేరేడుచర్ల మున్సిపాలిటీలలో ఈ నెల 11 నా జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను , తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కష్టపడుతున్నామని ఈ విషయం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని , ఎవరో ఏదో మాట్లాడి వారి పరువు వారు తీసుకుంటున్నారని అన్నారు . కోదాడ పట్టణంలో 26 కోట్ల రూపాయల నిధులతో 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మోతే మండల ప్రజలు సాగునీటి కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పాలేరు నుండి నీటిని తరలించడానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతుల కల నెరవేరుస్తున్నామని , కోదాడ పట్టణంలో 200 కోట్ల రూపాయలతో అండరగ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళిక చేస్తున్నామని, 50 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాన్నీ బాలాజీనగర్ లో నిర్మాణం జరుగుతుందని , 15 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఆదర్శవంతమైన బస్ స్టాండ్ , బస్ డిపో లను కోదాడలో నిర్మిస్తున్నామని అన్నారు . అలాగే రాష్ట్రంలో గడచిన 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డ్ ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అర్హులైన ప్రతి పేదవాడికి కొత్త రేషన్ కార్డ్ ఇస్తున్నామని , రాబోయే రోజులలో అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రబంధాలు సంతోషంగా , సంతృప్తిగా ఉన్నారని ఆశాభావం వ్యక్తపరిచారు.

బిఆర్ఎస్ లో కుటుంబ పాలన – కాంగ్రెస్ లో ప్రజా పాలన

రాష్ట్ర ప్రజలకు కుటుంబపాలన నుండి విముక్తి లభించిందని , కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన లో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు . ఆ ప్రభుత్వంలో 3 కోట్ల 17 లక్షల మంది ప్రజలకు ప్రతి నెల 13,600 కోట్లతో దొడ్డు బియ్యం ఇచ్చారని , ప్రజా ప్రభుత్వంలో 2 కోట్ల 80 లక్షల మంది ప్రజలకు 12 వేల కోట్ల ఖర్చుతో నాణ్యత తో కూడిన సన్నబియ్యం ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్ ప్రయాణం , 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, సన్నబియ్యం , సన్న వడ్లకు క్వింటాల్ కి 500 బోనస్ లతో పాటు 10 లక్షల ఆరోగ్య భీమా ఇస్తుందని దీనితో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఒక్క గంట సెలవు లేదు

మీ ఉత్తమంగా రాష్ట్ర మంత్రిగా ఉత్తమంగా పనిచేస్తున్నాడనీ, దానికి నిదర్శనమే తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పటి వరకు ఒక్క గంట సెలవు లేకుండా పని చేస్తున్నానని అన్నారు . తాను వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా , ఒక సారి ఎంపీ గా ఎన్నికయ్యాననీ తన అనుభవంతో చెప్తున్నానని రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్రం లో అన్ని మున్సిపల్ , కార్పొరేషన్ లలో గెలిపిస్తారని అన్నారు . ఈ నెల 16 న రాష్ట్రం మొత్తం మున్సిపల్ చైర్మన్లు , కార్పొరేషన్ మేయర్ లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశాభావం వ్యక్తపరిచారు. అలాగే కోదాడలో 35 కి 35 , హుజురాబాద్ నగర్ లో 28 కి 28 , నేరేడుచర్ల లో 15 కి 15 వార్డులు కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం తనకుందన్నారు . ఈ ఎన్నికలలో ఈ మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత తనదని ఓటర్లందరూ ఈ విషయం గమనించాలని అన్నారు . బిఆర్ఎస్ , బిజెపి, ఇతర పార్టీలు , స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లే అని అందుకోసం ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వెయ్యాలని పిలుపునిచ్చారు .

Leave A Reply

Your email address will not be published.