Take a fresh look at your lifestyle.

ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

  • 6 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ఆ పార్టీ నిర్వహించునుంది. ఈ మేరకు సోమవారం నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో చేసిన తీర్మానాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.ఏప్రిల్ 6న రాష్ట్రంలోని అన్ని బూత్ లలో బిజెపి జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఏప్రిల్ 8, 9 తేదీల్లో మండలాల వారీగా క్రియాశీలక కార్యకర్తల సమ్మేళనాలు, ఏప్రిల్ 10, 11, 12 తేదీల్లో గావ్ ఛలో, బస్తీ చలో అభియాన్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం ద్వారా కేంద్ర పథకాల లబ్ధిదారులతో సమవేశాలు, బస్తీలు, గ్రామాల్లో పబ్లిక్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. కార్యకర్తల ఇండ్లపై జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 14 నుంచి అంబేద్కర్ విగ్రహాల వద్ద స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 15, 16న జిల్లా స్థాయిలో చర్చా వేదికలు నిర్వహిస్తామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.