రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణ ప్రజల సౌకర్యార్థం మంచిర్యాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని మంచిర్యాల డిపో మేనేజర్ శ్రీనివాస్ కు సిపిఐ పార్టీ నాయకులు బుధవారం వినతి పత్రాన్ని అందించారు.క్యాతన్ పల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సర్వీస్ ప్రారంభించాలని కోరారు.జిల్లా కార్యదర్శి రామడుగుల లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ఇప్పకాయల లింగయ్య, పట్టణ కార్యదర్శి మిట్టపెల్లి శ్రీనివాస్, పౌలు, సత్యనారాయణ, వెంకటస్వామి, గోపి,మొండి పాల్గొన్నారు.