Take a fresh look at your lifestyle.

తొమ్మిదో వార్డు సమస్యలు పరిష్కరించాలి 

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదో వార్డులో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని మాజీ కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు బుధవారం వినతి పత్రాన్ని అందించారు.అమ్మ గార్డెన్,ఆర్ఆర్ నగర్,కొత్త,పాత తిమ్మాపూర్,చైతన్య కాలనీ,పద్మావతి కాలనీల లోని సీసీ రోడ్,సైడ్ డ్రైనేజీ,శానిటేషన్ తో పాటు అమృత్ 2.0 వాటర్ ట్యాంక్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ పనులను చేపట్టాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ రాజు త్వరలోనే సంబంధిత పనులు చేపడతామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.