ముద్ర ప్రతినిధి, హనుమకొండ : తెలంగాణ రాష్ట్రంలో నీట్ ఆధారంగా నిర్వహించనున్న అడ్మిషన్ల ప్రక్రియలో ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను ప్రాతిపదికన తీసుకోకూడదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలోబుధవారం వరంగల్ కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ను కలిసి వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మాందాల భాస్కర్ మాట్లాడుతూ నీట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని తెలిపారు, ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఏప్రిల్ 14 న ప్రభుత్వ జీవో వచ్చింది. కానీ, ఈ ఉప వర్గీకరణను నీట్ అడ్మిషన్ల ప్రక్రియలో అమలు చేయకూడదని మాలమహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పారు.అట్టి అప్పీలును సమర్ధిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు వెలువరించిందని గుర్తుచేశామని అన్నారు.దానికి అనుగుణంగా ఈ అడ్మిషన్ల నోటిఫికేషన్ లో పరిగణలోకి తీసుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్. గౌరవ అధ్యక్షులు చెరుకు రామచందర్. గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్(బాలన్న) వర్కింగ్ చైర్మన్ చేపూరి నరసింహ, గ్రేటర్ వరంగల్ మాల మహానాడు అధ్యక్షుడు రామ్ చందర్, మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షుడు మన్నె బాబురావు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు డాక్టర్. S. వెంకటేశ్వర్లు, డాక్టర్ మేర్జ అనిల్, మేడ రంజిత్, డాక్టర్ చంద్రమౌళి. గరిక అనిల్ , అనిత మహిళా అధ్యక్షురాలు, కే కుమార్ , సాంబయ్య.తదితరులు పాల్గొన్నారు.