ముద్ర ప్రతినిధి, భువనగిరి :
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మెరుగు మధు డిమాండ్ చేశారు.
మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల జిల్లా స్థాయి సమావేశం భువనగిరి పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో జిల్లా అధ్యక్షులు మెరుగు మధు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని పలువురు ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్రను స్మరించుకున్నారు. భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారం, ఉద్యమ స్పూర్తిని కొనసాగించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్ సౌకర్యo, ప్రభుత్వం ఇస్తామన్న 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని, తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అలాగే యువతలో ఉద్యమ స్పూర్తిని పెంపొందించడం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో జిల్లాలో ఉద్యమకారుల ఐక్యతను బలోపేతం చేయాలని తీర్మానించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు సుర్వి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండీ ఇమ్రాన్, టిఎల్ఎఫ్ నాయకులు కోడిమాలకృష్ణ, వినోద్, ట్రస్మ జిల్లా అధ్యక్షులు పాలకూర వెంకటేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి శ్రీరాములు, బీబీనగర్ జేఏసీ కన్వీనర్ ముస్కే జైపాల్ రెడ్డి సిపిఐ నాయకులు శోభన్ బాబు రమేష్ భాస్కర్ బద్దం వెంకట్రెడ్డి, ఆటో జాక్ నాయకులు గొర్ల లక్ష్మణ్, గోప రాజు గణేష్, పాండు రవీందర్ బాలన్, ఆత్మకూరు జేఏసీ కన్వీనర్ నిమ్మ శేఖర్ రెడ్డి, చాడా శశిధర్ రెడ్డి, ఆడెపు శ్రీను, పసునూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు..
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.