కిక్ బాక్సింగ్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల ధరూర్ క్యాంప్ రామాలయం కళ్యాణ మండపంలో గురువారం జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026-27 పోటీలను జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

చదువుతోపాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపిన విద్యార్తులు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. తల్లితండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలు సైతం క్రీడలను ప్రోత్సహించాలన్నారు.
క్రీడలతో మానసిక స్థైర్యం పెంపండడమే కాకుండా, చదువు పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుందన్నారు. జూన్ నెలలో జరగనున్న జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని జగిత్యాలకు మంచి పేరు తేవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు చారి , మంచాల కృష్ణ, టీవీ సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్ , కోచ్ రామాంజనేయులు, సంతోష్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.