కోరుట్ల, ముద్ర విలేకరి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సోమవారం రోజు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలో ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జీవాకర్ రెడ్డి, ఎమ్మార్వో కార్యాలయంలో కృష్ణ చైతన్య, మున్సిపల్ కార్యాలయంలో అల్లే మారుతి ప్రసాద్, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో వంద రోజుల కార్యచరణ ప్రణాళిక ర్యాలీని నిర్వహించారు. అనంతరం మున్సిపల్ సిబ్బందితో 100 అనే అక్షరాన్ని రూపొందించారు. మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, సాధారణ ప్రజలతో బస్టాండ్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ప్రతిజ్ఞ చేపించారు.
