ముద్ర, బీబీనగర్ : శ్రీరామ నవమి సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం , రుద్రవెల్లి , పల్లెగూడం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవాపూర్, రుద్రవెల్లి ,పల్లెగూడం గ్రామాలలో ఆయా ఆలయ ప్రాంగణాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో రాఘవపూర్ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్, ఉపసర్పంచ్ సిలివేరు కవిత మహేష్, రుద్రవెల్లి సర్పంచ్ జిల్కపల్లి సరళ అశోక్ రెడ్డి, పల్లెగూడం సర్పంచ్ అప్పారెడ్డి బలరామిరెడ్డి, నాయకులు బండారి ఆగమయ్య గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.