Take a fresh look at your lifestyle.

స్థానిక మావలా పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

ముద్ర ప్రతినిధి, ఆదిలాబాద్: శనివారం స్థానిక మావల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందిని ఉద్దేశించి పలు సూచనలు చేశారు. రానున్నది ఎన్నికల సమయం ప్రతి ఒక్కరూ పూర్తి సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. పట్టణంలో మరియు పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న వార్డుల మరియు గ్రామాల కు కేటాయించిన విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ఎలాంటి సమాచారం అయినా ముందుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్ కు అందే విధంగా సమాచార వ్యవస్థను నిర్మించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క పోలీసు కు క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్క పోలీసు కు శుభ్రమైన యూనిఫామ్, నీట్ సేవింగ్ అందాన్ని తీసుకొస్తాయని వాటిని కచ్చితంగా పాటించాలని సూచించారు. స్టేషన్లో ఉన్న పాత వాహనాలపై తగు చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ త్వరితగతిన సిబ్బందిని కేటాయించి సత్వర న్యాయం అందించే విధంగా ప్రజలలో పోలీసు పట్ల నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులను నిర్వర్తించాలన్నారు. కోర్టు డ్యూటీ అధికారి తో ప్రతివారం సమావేశం ఏర్పాటు చేసి కోర్టులో కేసుల స్థితిగతులపై నేరస్తులకు శిక్షలు పడేలా పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం పోలీస్ స్టేషన్ నందు రోల్ కాల్ నిర్వహిస్తూ సిబ్బంది పనితీరును పరిశీలించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా కోర్టుల నందు చార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు. క్రమశిక్షణతో మరియు కష్టపడి పనిచేసే పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరికి సమానమైన విధులు వచ్చే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రాత్రి సమయాలలో బీట్ సిస్టం సక్రమంగా నిర్వర్తిస్తూ ఎలాంటి దొంగతనాలు నేరాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని ఎలాంటి సమాచారమైన అందే విధంగా సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సూచించారు. గంజాయి, పేకాట, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలన్నారు. డయల్ 100 సిబ్బంది సంఘటన స్థలాలకు వీలైనంత త్వరగా చేరుకొని బాధితులకు ఎలాంటి నష్టం చేకూర్చకుండా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, మావల సీఐ కర్ర స్వామి, ఎస్సైలు ఎల్ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, యూనుస్, ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.